మరమ్మతుల నిమిత్తం 15వ తేదీ విద్యుత్తుకు అంతరాయం
1 min read
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ
విద్యుత్ వినియోగదారులు సహకరించాలని మనవి
ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: ఏలూరు మండలం, కోటదిబ్బ సెక్షన్ పరిధి లోనున్న 33/11 కేవి కోటదిబ్బ సబ్ స్టేషన్ లోనీ 11 కేవి కెనాల్ మరియు వెన్నవల్లి వారి పేట ఫీడర్స్ నందు ట్రీ కటింగ్ మరియు వార్షిక మారమ్మతుల నిమిత్తం గాను ది:15.03.2026 (ఆదివారం ) నాడు ఉదయం 09.00 గం.ల నుండి మధ్యాహ్నం 12.00 గం.ల వరకు సరఫరా నిలిపివేయ బడును. వీవీ పేట, బావిశెట్టి వారి పేట, నల్ల దిబ్బ, కెనాల్ రోడ్, నవాబుపేట,లంబాడిపేట మరియు కోడెలురోడ్ లోని గ్రామములకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా కె.యం. అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ ఒక ప్రకటనలో కోరారు.

