NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెద్ద హ్యాట గ్రామంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు

1 min read

– టీమ్ నమోదు కోరుతూ నిర్వాహకుల ప్రకటన

హోళగుందన్యూస్ నేడు : హోళగుందమండలం పెద్ద హ్యాట గ్రామంలో బంగారమ్మ దేవి, కోలప్ప రమ్మదేవి, సుంకులమ్మ దేవి దేవర ఉత్సవాల సందర్భంగా మండల స్థాయి కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన ఆసక్తిగల టీములు తమ జట్లను 21-03-2026 లోపు నమోదు చేసుకోవాలని కోరారు.కబడ్డీ పోటీలు 22-03-2026 ఆదివారం సాయంకాలం 4 గంటలకు ప్రారంభమవుతాయని, పాల్గొనే ప్రతి టీమ్ సభ్యులు ఆ సమయానికి ముందే మైదానం వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు తెలిపారు.అలాగే ఈ పోటీల సెమీ ఫైనల్ మ్యాచ్‌లు 23-03-2026 సోమవారం రోజున నిర్వహించబడతాయని వెల్లడించారు. ఈ కబడ్డీ పోటీలకు వేదికగా పెద్ద హ్యాట గ్రామంలోని వీరభద్ర స్వామి వారి మైదానం ఎంపిక చేయబడింది.మండల స్థాయి కబడ్డీ పోటీల ద్వారా గ్రామీణ యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కావున మండలంలోని యువ క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

About Author