NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాబ్ క్యాలెండర్ విడుదల నిరుద్యోగ యువతకి వరం

1 min read

పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు  శ్రీ బోడే ప్రసాద్  అన్నారు…

పెనమలూరు, న్యూస్​ నేడు:  నియోజకవర్గం,తాడిగడపమున్సిపాలిటీ,పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్  కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షులు వీరంకి గురుమూర్తి ,కూటమి నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించారు.సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్  మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ,ఉగాది పండుగ సందర్భంగా నిరుద్యోగ యువతకి కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయటం వరమన్నారు.లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారంగతంలో డీఎస్సీ నిర్వహించడం,కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలు చేయడం, ఇప్పుడు10,090ఉద్యోగాల జాబ్ కేలండర్ విడుదల చేసి అన్న మాట నిలబెట్టుకున్నారన్నారు.16 లక్షల కోట్ల పెట్టుబడును రాష్ట్రానికి తీసుకువచ్చి రాబోయే ఐదు,ఆరు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.యువతకు 20 లక్షల ఉద్యోగుల కలపనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడమే కాకుండా, రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన తల్లికి వందనం,అన్నదాత సుఖీభవ,ఉచిత గ్యాస్ సిలిండర్లు హామీలే కాకుండా ఎన్నికల్లో ఇవ్వని దివ్యాంగ శక్తి వంటి అనేక సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు.నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలండర్ విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,మంత్రి నారా లోకేష్  కీ కృతజ్ఞతలు తెలియజేశారు.కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షులు వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, బిడ్డల భవిష్యత్తుకు ప్రాధాన్యతిస్తూ  త్రిశ్యుల వ్యూహంతో పనిచేస్తుంది. ఒక్కసారి ప్రజలు గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్  శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్ పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనందప్రసాద్ రజక్ కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు ఏ కుల విజయేంద్ర షేక్ బుజ్జి షేక్ ఇమామ్ ఎర్రగడ్డ సుచిత్ర తుమ్మల రామకుమార్ బొంగరాల అబ్రహం విగ్నేష్ చౌదరి కూటమి నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

About Author