నిర్దేశించిన లక్ష్యం కు రెట్టింపు లక్ష్యం చేరుకోవాలి
1 min read

2026-27 ఆర్థిక సంవత్సరానికి జి.డి.డి.పి లక్ష్యాల సాధనకు సమగ్ర కార్యాచరణ
జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జి.డి.డి.పి (గ్రాస్ డిస్ట్రిక్ట్ డోమెస్టిక్ ప్రోడక్ట్ ) లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, వాటి రెట్టింపు లక్ష్యసాధన కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు.శుక్రవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జి.డి.డి.పి, కీలక పనితీరు సూచికలు ( కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ) తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యమే కాకుండా ఆ లక్ష్యానికి రెట్టింపుగా లక్ష్యం నిర్దేశించుకుని సాధించాలని , రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో ప్రతి మండము మరియు నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులను నియమించి, వారు క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగారు పర్యటించాలని తెలిపారు.వీరు తమ పరిధిలోని గ్రామాలు, మండలాల్లో పర్యటించి, ప్రభుత్వ పథకాల అమలు స్థితిని ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి పర్యటన అనంతరం పూర్తి స్థాయి నివేదికను సమర్పించడం తప్పనిసరి అని పేర్కొంటూ, ఆ నివేదికల ఆధారంగా సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా, ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రజా సేవా సంస్థలను అధికారులు స్వయంగా తనిఖీ చేసి, వాటి పనితీరు, సదుపాయాలపై సమగ్రంగా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో తలసరి ఆదాయం పెంపు దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాలలో ఉత్పాదకత పెంపు ద్వారా జి.డి.డి.పి వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల్లో సానుకూల అభిప్రాయం కలిగేలా విద్యా రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్న పాఠశాలల్లో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు వంటి అంశాలపై సమగ్ర నివేదికలను జిల్లా విద్యాధికారి సమీక్షించి, లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశానికి సీఈవో జిల్లా పరిషత్ నాసర రెడ్డి , సిపిఓ భారతి,ఐ సి డి ఎస్ పిడి విజయ, డిసిహెచ్ఎస్ జఫ్రూళ్ళ, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి, డిఇఓ సుధాకర్, డి టి వో రామచంద్ర రావు, ఎస్ఈ ఆర్ డబ్ల్యూ ఎస్ మనోహర్ ,అనిమల్ హస్బండ్రీ జెడి హేమంత్ కుమార్, టూరిజం అధికారి లక్ష్మీనారాయణ, డి ఎం సి విల్ సప్లై వెంకట రాముడు, డిటిసి శాంతకుమారి, జె డి అగ్రికల్చర్ వరలక్ష్మి, డిపిఓ భాస్కర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ , ట్రాన్సకో ఎస్ఈ ప్రదీప్ కుమార్,అడిషనల్ మున్సిపల్ కమీషనర్ కృష్ణ మొదలగు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

