NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లాలో “జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్” అమలుకు కట్టుదిట్టమైన చర్యలు

1 min read

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న “జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్” (వ్యర్థ రహిత సంస్థలు) థీమ్ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ, ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం తదితర సంస్థల్లో సమగ్రంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమ అమలుపై అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న “జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్’ థీమ్‌తో స్థిరమైన పారిశుద్ధ్య సంస్కృతికి నాంది పలికే ఉద్యమంగా భావించి కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి సంస్థను వ్యర్థ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలోని ప్రతి ప్రభుత్వ సంస్థను “జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్”గా తీర్చిదిద్దడం ద్వారా నంద్యాల జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలబెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

About Author