కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిధి 11కెవి వెన్నవల్లి వారి పేటలో చెట్లు తొలగింపు
1 min read

ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలుపుదల
విద్యుత్ వినియోగదారులు సహకరించాలని మనవి
కె.ఎం.అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,ఆపరేషన్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు 1వ పట్టణంలో గల కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిదిలో 11కెవి వెన్న వల్లివారి పేట ఫీడరు చెట్ల తొలగింపు నిమిత్తం 31-03-2026 వతేది మంగళవారం ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపదల చేయబడునని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆపరేషన్ ఏలూరు కె.ఎం. అంబేద్కర్ సోమవారం తెలిపారు. ఈ సమయములో కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిధి లో గల అగ్రహారం, కెనాల్ రోడ్, సత్యనారాయణ పేట, లంబాడి పేట, వెన్నవల్లి వారి పేట, నవాబ్ పేట, బాలాజీ థియేటర్, జంట కళ్యాణ మండపాలు మరియు రామకోటి పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

