NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ వైద్య విద్యార్థుల పరిశోధనలు, క్రీడలకు ప్రోత్సాహం!

1 min read

అల్లోపతితోపాటు ఆయుష్, డెంటల్, ఫిజియోథెరపీ, అలైడ్ సైన్సెస్ కోర్సులకు కూడా వర్తింపు

 విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫ్యాకల్టీకి రీసెర్చ్ గ్రాంట్ పెంపు

వర్సిటీ కేంద్రంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ ఏర్పాటు

ఈ-రీసోర్స్ ద్వారా 24 గంటలపాటు విద్యార్థులకు పరిశోధన సమాచారం

పూర్వ వైద్య విద్యార్థుల అసోసియేషన్లను ఒకే తాటిపై తెచ్చేందుకు కృషి

వైద్య విద్యలో ప్రమాణాల పెంపు కోసం అభివృద్ధికి మరికొన్ని వినూత్న కార్యక్రమాలు

వర్శిటీ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడి

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పరిశోధనలు, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పుల్లల చంద్రశేఖర్ వెల్లడించారు. వైద్య విద్యలో ప్రమాణాల పెంచేందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తీసుకుంటున్న చర్యలకు కొనసాగింపుగా విశ్వవిద్యాలయం తరపున కూడా కొత్త నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు వైద్య విద్య ప్రమాణాల పెంపుతోపాటు వ్యాధుల నిరోధ చర్యల్లో కూడా విశ్వవిద్యాలయం భాగస్వామ్యం కాబోతుందన్నారు ఇందులో భాగంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ను కూడా ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు విజయవాడలోని విశ్వవిద్యాలయంలో సోమవారం మద్యాహ్నం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. “ఈ నెల 17వ తేదీ విశ్వవిద్యాలయంలో జరిగిన 244వ పాలకవర్గ సమావేశం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ అధ్యక్షతన జరిగింది.అని ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. విలేకర్ల సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయిసుధీర్, వర్శిటీ రీసెర్చి అండ్ డెవలప్మెంటు డైరెక్టర్ డాక్టర్ ఎం. లక్ష్మీసూర్యప్రభ, సి ఓ ఈ శ్రీకాంత పాల్గొన్నారు.  ఉపకార వేతనం!పరిశోధనలపట్ల విద్యార్థులు మొగ్గుచూపేలా ప్రతి ఏటా కనీసం 1,000 మందికి ఉపకార వేతనం కింద ఆరునెలలపాటు రూ.5వేల చొప్పున రూ. 30వేలు ఇస్తాం. ప్రస్తుత విధానంలో ప్రతి ఏడాది యూజీ మెడికల్ విద్యార్థులకు మాత్రమే పరిశోధనల నిమిత్తం నెలకు ఐదువేల చొప్పున 500 మందికి రెండునెలలకు కలిపి

క్రీడల నిర్వహణకు ఏటా రూ. 10 లక్షలు

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో క్రీడల నిర్వహణ, మైదానాల అభివృద్ధి కోసం ప్రతి కళాశాలకు రూ. 10 లక్షల చొప్పున ప్రతిఏటా ఇస్తారు వైద్య విద్యార్థులకు బోధనతోపాటు మానసికోల్లాసాన్ని కలిగించేలా క్రీడలు, ఇతర పోటీల నిర్వహణకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. దీనివల్ల ప్రతి ఏడాది రూ.170 కోట్ల వరకు వ్యయమవుతుంది. ప్రస్తుతం చీడల పోటీలు, ఆటలకు ఉన్న ప్రాధాన్యం పెరగాల్సి ఉంది నిధులు ఇవ్వడం ద్వారా క్రీడలవైపు విద్యార్థులను దృష్టిపెట్టేందుకు వీలవుతుంది’ అని ఉప కులపతి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సాయి సుధీర్, సూర్యప్రభ వివరించారు. దీనివల్ల పరిశోధనలపట్ల ఆసక్తి ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది’ అని విశ్వవిద్యాలయం  డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ (కన్సార్టియం కో-ఆర్డినేటర్) డాక్టర్ కె.సుధ వెల్లడించారు.

About Author