ఏప్రిల్ 2 న వాటర్ స్పోర్ట్స్ ఎంపిక పోటీలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగర శివారులోని గార్గేయపురం చెరువులో ఏప్రిల్ 2 వ తేదీన జిల్లా స్థాయి శాప్ వాటర్ స్పోర్ట్స్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తెలిపారు. అండర్-15 సబ్ జూనియర్,అండర్-18 జూనియర్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంపిక పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాల, బాలికలు ఏప్రిల్ 11 నుంచి 12 వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి శాప్ లీగ్ వాటర్ స్పోర్ట్స్ పోటీలలో జిల్లా జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.రోయింగ్,డ్రాగన్ బోట్,కెనోయింగ్ అండ్ కయాకింగ్ క్రీడాంశాలలో ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు.ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు https:/sports.ap.go.in లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

