NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బుసినే మారెప్ప మృతికి ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఘన నివాళి

1 min read

చిప్పగిరి మండలంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే – యువనేత బుసినే చంద్రశేఖర్ పాల్గొన్నారు

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం పరిధిలోని చిప్పగిరి మండల గ్రామానికి చెందిన ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి సోదరుడు బుసినే మారెప్ప అనారోగ్యంతో మృతి చెందడం పట్ల స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాద వార్త తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి వెంటనే గ్రామానికి చేరుకుని  మారెప్ప భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖాన్ని పంచుకుంటూ ధైర్యం చెప్పారు. కుటుంబానికి తనవంతు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనై కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుసినే విరూపాక్షితో పాటు ఆయన సోదరుడు బుసినే వెంకటేష్, తనయుడు యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై బుసినే మారెప్పకు నివాళులు అర్పించారు.బుసినే మారెప్ప మరణం కుటుంబానికి, గ్రామానికి తీరని లోటని గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.

About Author