NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు క్రీస్తు త్యాగ స్మరణ

1 min read

హోళగుంద మండలం హోళగుంద గ్రామంలోని పెనుయేలు ప్రార్థన మందిరంలో భక్తిశ్రద్ధల నడుమ ప్రత్యేక ఆరాధన కార్యక్రమం

సిలువపై యేసు పలికిన ఏడు మాటల ఆధ్యాత్మిక సందేశాన్ని వివరించిన పాస్టర్ టీ టస్

హోళగుందన్యూస్ నేడు:  హోళగుంద మండలంలోని హోళగుందగ్రామంలో ఉన్న పెనుయేలు ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థన మరియు ఆరాధన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించబడింది. యేసు క్రీస్తు మానవాళి రక్షణ కోసం సిలువపై చేసిన మహా త్యాగాన్ని స్మరించుకుంటూ గ్రామంలోని క్రైస్తవ భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రార్థన మందిరం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు ప్రార్థనలు, కీర్తనలు, బైబిల్ పఠనం ద్వారా యేసు ప్రభువు చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను వివరిస్తూ పాస్టర్ టీ టస్ ప్రత్యేక సందేశం అందించారు.యేసు క్రీస్తు సిలువపై పలికిన ఏడు చివరి మాటలలో ఉన్న ప్రేమ, క్షమ, కరుణ, త్యాగం, విశ్వాసం మరియు మానవాళికి ఇచ్చిన రక్షణ సందేశాన్ని పాస్టర్ టీ టస్ ఎంతో హృదయాన్ని తాకే విధంగా వివరించారు. “తండ్రీ, వీరిని క్షమించుము” అనే యేసు వాక్యం ద్వారా క్షమాగుణం ఎంత గొప్పదో, “ఇది పూర్తయ్యెను” అనే మాట ద్వారా తన త్యాగ ధర్మాన్ని ఎలా నెరవేర్చారో విశదీకరించారు.మానవాళి పాప విమోచన కోసం యేసు ప్రభువు సిలువపై తన ప్రాణాలను అర్పించిన ఈ దినం ప్రతి క్రైస్తవునికి ఎంతో పవిత్రమైనదని, ఆయన చూపిన ప్రేమ, సేవ, త్యాగ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పాస్టర్ సూచించారు.కార్యక్రమం ముగింపులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేశ శాంతి, గ్రామ ప్రజల సుఖసంతోషాలు, కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో యేసు త్యాగాన్ని స్మరించుకున్నారు.గుడ్ ఫ్రైడే సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ఆరాధన కార్యక్రమం కులగుంద గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పి భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది.

About Author