NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీఆర్ నాయుడు ని వెంటనే పదవి నుండి తొలగించాలి– ఎమ్మెల్యే

1 min read

ఆలూరు న్యూస్ నేడు: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ_వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ప్రత్యేక పూజలు ఆలూరు నియోజకవర్గం కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టిన  ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆర్ ​అండ్​ బి గెస్ట్ హౌస్ నుంచి బళ్లారి రోడ్డులో ఉన్న శ్రీ పాండు రంగ స్వామి దేవాలయం(వెంకటేశ్వర స్వామి) దేవాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపిన ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి   విలేకరులతో మాట్లాడుతూ. మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాండు రంగ స్వామి దేవాలయం(వెంకటేశ్వర స్వామి ) వారికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది…. అదేవిధంగా బిఆర్ నాయుడు రాస లీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు నాయుడు ఏమి చర్యలు తీసుకోవడం లేదు అని అన్నారు. చర్యలు తీసుకోకుండా బీఆర్ నాయుడును వెనకేసుకొని వస్తున్నరు అని అన్నారు.రాష్ట్ర డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్  ఎందుకు నోరు మెదపడం లేదు అన్నారు. సనతన ధర్మం ఇప్పుడు ఎక్కడ పోయిందో అర్థం కావడం లేదు అని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు.బీఆర్ నాయుడు ని వెంటనే పదవి నుండి తొలగించాలి అని డిమాండ్ చేశారు. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  మరియు ఆలూరు నియోజకవర్గం అబ్జర్వర్ పత్తికొండ రామచంద్ర రెడ్డి  ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల కన్వీనర్లు, ఎంపీపీ  లు, జడ్పీటీసీ లు, సర్పంచ్లు, ఎంపిటీసీ లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు,నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author