NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ జన్మదిన వేడుకలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ మాజీ శాసన సభ్యురాలు  కోట్ల సుజాతమ్మ  పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా శనివారం ప్యాపిలి పట్టణంలోని తేదేపా కార్యాలయంలో కోట్ల సుజాతమ్మ జన్మదిన తేదేపా శ్రేణులు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థులకు కేక్ పంచారు. అలాగే డోన్ మాజీ శాసన సభ్యురాలు  కోట్ల సుజాతమ్మ 66వ పుట్టిన రోజు సందర్బంగా గుత్తి బాట సుంకులమ్మ ఆలయంలో 66 టెంకాయలు కొట్టి గుత్తి బాట సుంకులమ్మ అమ్మవారిని కోట్ల సుజాతమ్మ కి ఆయుష్షు ఆరోగ్యాలు,అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రజలకు సేవ చేయడానికి మరీంత శక్తిని ప్రసాదిoచాలని కోరుకుంటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో తేదేపా మండల ఇన్చార్జి ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు కొంగనపల్లి మధు,ఎపి కుమ్మరి/శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మరి సుధాకర్,ఎపి రాష్ట్ర తేదేపా ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి మదు కుమార్, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్, తేదేపా జనరల్ సెక్రెటరీ నడిగడ్డ నాగేంద్ర, తేదేపా నాయకులు రాజా రవి, ఎస్ కే వలి, గుడిపాడు వెంకటరెడ్డి,కడితం ప్రతాప్ రెడ్డి, బాలకృష్ణ, వెంకటేష్,బ్యాంక్ శ్రీను,చాకలి సుంకన్న, రాజు,మహెష్, రామకృష్ణ, తదితరులు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *