NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రీడాకారులకు సహయ సహకారాలు అందిస్తాం

1 min read

వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి

మంత్రాలయం న్యూస్ నేడు : క్రీడాకారులకు రాంపురం రెడ్డి సోదరులు సహయ సహకారాలు అందిస్తామని వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు లో భీమ నిలయం లో జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు రూ 20 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు ఆర్థికంగా చేయూతనందించి ప్రోత్సహించేందుకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.   స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయం అన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు రాజస్థాన్ ఉదయపూర్ లో జరిగే జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు  పాఠశాల విద్యార్థులు చిన్న నాగయ్య, వినయ్, నరసింహ ఎంపికైన నేపథ్యంలో వారికి ఖర్చులకు గాను 20 వేల రూపాయలు అందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పురుషోత్తం రెడ్డి, పిడి రవీంద్ర పిఈటి నరసింహ రాజు క్రీడాకారుడి తండ్రి వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *