NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేద‌ల‌కు మంచి చేయాల‌న్నది డాక్టర్ ఇస్మాయిల్ ఆలోచ‌నా విధానం

1 min read

రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ గుప్తా

కర్నూలు, న్యూస్​ నేడు:  పేద ప్రజ‌ల‌కు మంచి చేయాల‌న్నది దివంగ‌త డాక్టర్ ఇస్మాయిల్ ఆలోచ‌నా విధాన‌మ‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ గుప్తా అన్నారు. డాక్టర్ ఇస్మాయిల్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా కొత్తపేట‌లోని ఆయ‌న స‌మాధి వ‌ద్ద ముస్లిం నాయకులతో కలిసి మంత్రి టి.జి భ‌ర‌త్ గుప్తా నివాళుల‌ర్పించారు. అనంత‌రం మాట్లాడుతూ రూ.2కే వైద్యం చేస్తూ పేద‌ల డాక్టర్‌గా ఆయ‌న పేరు పొందార‌న్నారు. దేశ వ్యాప్తంగా డాక్టర్ ఇస్మాయిల్‌కు మంచి పేరు ఉంద‌న్నారు. పేద‌ల‌కు సేవ చేయాల‌న్న ఆయ‌న ఆలోచ‌నా విధానం అంద‌రికీ స్పూర్తి అవ్వాల‌న్నారు. త‌న తండ్రి టి.జి వెంక‌టేష్ కు, డాక్టర్ ఇస్మాయిల్‌తో ఎంతో మంచి అనుబంధం ఉంద‌న్నారు. ఎవ్వ‌రిని అడిగినా వీరిద్ద‌రినీ రామ్‌, ర‌హీమ్ అని పిలిచేవార‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ చెప్పారు. కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలను ఆయన కాపాడారని చెప్పారు. ఆయన చేసిన సేవలను పుస్తకం రూపంలో ముద్రిస్తే బాగుంటుందన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *