అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం
1 min read

మా ఎన్డీయే ప్రభుత్వంలో నిజమైన రాజ్యాంగం అమలవుతోంది
ఓల్డ్ బస్టాండుతో పాటు కొత్త బస్టాండులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు, న్యూస్ నేడు: తమ ఎన్డీయే ప్రభుత్వంలోనే నిజమైన అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఓల్డ్ బస్టాండులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు కొత్త బస్టాండులోని డిపో-1లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం అన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారంటే ఇందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన బలమైన రాజ్యాంగమే కారణం అన్నారు. రాజ్యాంగాన్ని సరిగ్గా తమ నాయకులు అమలు చేస్తున్నారన్నారు. గడిచిన వైసీపీ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి తేడా ఏంటో ప్రజలకు తెలుసన్నారు. ఇక విద్య వల్ల విద్యార్థుల జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చాన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. త్వరలో డ్రోన్ సిటీ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇవన్నీ పూర్తయితే నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.


