ఘనంగా 76వ సిఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ పట్టణంలోని అన్నా క్యాంటీన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు అల్పాహారం వడ్డించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని, స్వయంగా లబ్ధిదారులకు అల్పాహారం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు.అల్పాహారం పంపిణీ అనంతరం ఎమ్మెల్యే గారు పేదలతో కలిసి భోజనం చేసి, వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుంటూ కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, వారికి అవసరమైన సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.


