ఘనంగా 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం లో పాతపాడు గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర హై స్కూల్ నందు 2008-2009 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ముందుగా ఉమామహేశ్వర హై స్కూల్ కరస్పాండెంట్ & హెడ్మాస్టర్ శ్రీ కొండారెడ్డి గారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎందుకంటే విద్యార్థులు పదవ తరగతి తర్వాత వారి వారి అభిరుచులకు అనుకూలంగా కోర్సులను తీసుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదగారని, ఇప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ ఒక చోట చేరి వారి అభివృద్ధికి తోడ్పడినటువంటి స్కూల్ పరిసరాలను గుర్తుకు తెచ్చుకున్నారన్నారు. వీరందరూ ప్రభుత్వం ఉద్యోగులుగాను, ప్రవేట్ ఉద్యోగులుగాను లేదా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ చేసుకుని మంచి అభివృద్ధికి సాధించడానికి స్కూల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ ఉన్నత బోధన తోడ్పాటును అందించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సంపాదన ఎంత ముఖ్యమో ఇతరులకు సహాయాలని అందించడం కూడా అంతే ముఖ్యమని ఇతరులకు సహాయ పడటం వల్ల తల్లిదండ్రులకు చదివినటువంటి విద్యాసంస్థలకు మంచి పేరు వస్తుందని ఆయన తెలిపారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి రాఘవ గౌడ్ మాట్లాడుతూ మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని మేమందరం ఒకచోట కలవటమే కాకుండా మా ఉపాధ్యాయులను స్మరించుకుంటూ వారు బోధించిన బోధలను గుర్తుకు తెచ్చుకుంటూ వారిని సన్మానించడం మా జీవితం ధన్యమైందని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు నాగముణి రెడ్డి, ఉపాధ్యాయులు రామకృష్ణ, రామ్మోహన్ రెడ్డి, గొల్ల కుమారస్వామి, రాజాహుస్సేన్బాలచంద్రుడు, సుబ్బారావు ,సుంకన్న, శివనాగిరెడ్డి, వెంకట శివుడు ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు కాసిం ,మద్దిలేటి స్వామి ,అమర్ ,గాది లింగ, దూద్ పేరా, నాగరాజు, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.