అధిక సంఖ్యలో శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు
1 min read
వివిధ సేవల రూపెణ రూ: 1,04,950/-లు ఆదాయం
కుక్కల ధర్మరాజు అనే భక్తుడు 946 గ్రాముల వెండి శఠారిని కానుకగా బహుకరణ
నిత్య అన్నదాన సత్రంలో భక్తులు ప్రసాద స్వీకరణ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : గురవాయిగూడెం గ్రామములో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయమువద్ద ప్రతి శనివారం నిర్వహించు అభిషేకసేవ సందర్భముగా ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చకస్వాములు శాస్త్రోక్తంగా పంచామృతఅభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంనకు చెందిన కుక్కల ధర్మరాజు 946 గ్రాముల వెండి శఠారిని కానుకగా అందజేశారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, ప్రసాదాలు అందజేశారు. మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల, విరాళాల ద్వారా రూ 1,04,950/-లు సమకూరినది. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలిపారు.