PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రపతిగా నియమించాలంటూ… ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు !

1 min read

పల్లెవెలుగువెబ్ : కీలకమైన కేసుల విచారణతో బిజీగా ఉండే సుప్రీంకోర్టు ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను భారత రాష్ట్రపతిగా నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కిశోర్ జగన్నాథ్ సావంత్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం పరిశీలించింది. పిటిషన్ తీరుతెన్నులపై ఆ ఇద్దరు న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. ఇదొక దిక్కుమాలిన పిటిషన్ అని, సుప్రీంకోర్టు విధివిధానాలను అవహేళన చేసేలా ఈ పిటిషన్ ఉందని వారు పేర్కొన్నారు. ఇలాంటి పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుతో వేళాకోళం ఆడుతున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు.

About Author