ఏపీలో ముందస్తు ఎన్నికలు !
1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ చాలా కాలం నుంచే విపక్ష టీడీపీ చెబుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ లోనే జగన్ ఎన్నికలకు వెళతారంటూ ఆయన అన్నారు. ఇందులో భాగంగా ముందస్తు ఎన్నికలు కావాలంటూ జగన్ ఢిల్లీ పెద్దలను కోరుతున్నారని ఆరోపించారు. డిసెంబర్ లోనే జగన్ అసెంబ్లీని రద్దు చేసే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలకే కాకుండా ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్న కారణంగానే జగన్ ముందస్తు ఎన్నికల దిశగా సాగుతున్నారని ఆయన అన్నారు.

