NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన బీసీ బాలిక వసతి గృహం ఏర్పాటు చేయాలి

1 min read

ప్రస్తుతం ఉన్నటువంటి బిసి  బాలికల వసతి గృహానికి   కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలి 

పత్తికొండ, న్యూస్​ నేడు : పత్తికొండలో నూతన బీసీ బాలికల వసతిగృహం ఏర్పాటు చేయాలని, అలాగే ప్రస్తుతం ఉన్న బాలికల వసతిగృహానికి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ నాయకుల బృందం  పత్తికొండలో ఉన్న బీసీ బాలికల వసతిగృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హాస్టల్లో విద్యార్థులు వర్షం వచ్చినప్పుడు హాస్టల్ పైనుంచి నీళ్లు కారుతుందని, అదేవిధంగా కాంపౌండ్ వాల్ లేక నైట్ టైం లో డ్రింకర్స్ హాస్టల్లోకి చొరబడుతున్నారని తెలిపారు ఆందోళన చెందారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మలమూత్ర విసర్జనకు కూడా అక్కడికే వస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన చాలా ఇబ్బంది జరుగుతుందని, అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు స్కూల్ విద్యార్థులకు ఒకటే హాస్టల్ ఉండడం వలన విద్యార్థులకు పడుకోవడానికి స్థలం చాలడం లేదని  చెప్పారు. విద్యార్థులు ప్రతిరోజు చాలా ఇబ్బందిగా పడుతున్నారని అన్నారు. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ హాస్టల్ కాంపౌండ్ వాల్ నిర్మించి, అదే విధంగా నూతన బీసీ గర్ల్స్ హాస్టల్ ను ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ జూనియర్ కళాశాల సెక్రటరీ రంగస్వామి అధ్యక్షులు బాబు పాల్గొన్నారు.

About Author