NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిర్మల హృదయుడు ఘంటసాల..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రథమంగా మాట్లాడిన డాక్టర్ శంకర్ శర్మ  ఘంటసాల గురించి మాట్లాడుతూ, దైవం మానుష రూపేణ అన్న సూక్తి ఘంటసాల   విషయంలో అక్షర సత్యం అనీ,  ఆయన నిజంగా దైవ స్వరూపుడు,  మానవాళికి తన గానామృతం ద్వారా ఎన్నో రోగాలను నయం చేస్తూ ఆరోగ్యాన్ని పంచి ఇచ్చిన మహామనీషి అని కొనియాడారు! వ భేషజాలు, ఈర్ష్యా ద్వేషాలు లేని నిష్కల్మషమైన నిర్మల హృదయుడు ఘంటసాల అని పొగిడారు! ప్రపంచమంతా గర్వించదగ్గ గాన గంధర్వుడు ఘంటసాల అని ఆయనను స్మరించుకోవడం ఈరోజు చాలా ఆనందకరం అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు!ఈరోజు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 51 వ వర్ధంతి సందర్భంగా, పద్మశ్రీ ఘంటసాల గాన కళా సమితి సభ్యులు, ఆయకరభవన్ ఎదురుగా ఉన్న ఘంటసాల  విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు! ఈ సందర్భంగా డాక్టర్ భవానీ ప్రసాద్  మాట్లాడుతూ, హే కృష్ణ ముకుందా మురారి అని ఘంటసాల  గొంతెత్తి పాడితే ప్రపంచమే ఉలిక్కిపడి చూస్తుంది! ఆయన వర్ధంతి ఇంత ఘనంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది, ఇలాగే ఈ సంస్థ మూడు పువ్వులు ఆరు కాయలు లాగా కార్యక్రమాలను నిర్వహించాలని ఆశిస్తున్నానని తెలిపారు! డాక్టర్ చంద్రశేఖర్  మాట్లాడుతూ, పద్మశ్రీ ఘంటసాల గాన కళా సమితి వారు జయంతి మరియు వర్ధంతులను ఏ సంవత్సరం ఒదిలి పెట్టకుండా, ఘనంగా నిర్వహిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నానని తెలిపారు! ఆయన విగ్రహ ఆవిష్కరణ కోసం అవిరళ కృషిని చేస్తానని ప్రతిన బూ నారు! అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ సీతారాం , పతి ఓబులయ్య , డాక్టర్ నగేష్ , జాయింట్ కలెక్టర్ శ్రీ కొండయ్య  తమ తమ సందేశాలతో సభ్యులను ఉత్తేజపరిచారు! శ్రీ కొండయ్య  చల్లని వెన్నెలలో అనే పాటతో, మరియు శ్రీనివాస్  శివశంకరి అనే పాటతో, కర్నూలు సుశీలమ్మ సినిమతి సుధారాణి , ఎలమర్తి రమణయ్య  ఘంటసాల మధుర గీతాలను ఆలపించి సభ్యులను అలరించారు! రాఘవేంద్ర ప్రసాద్  వందన సమర్పణతో కార్యక్రమం ఘనంగా ముగిసింది! ఇందులో జగన్నాథ్ గుప్తా, మధుసూదన్, బి ఎస్ రావు, రాముడు నగేష్ మొదలగువారు పాల్గొన్నారు!

About Author