NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశ్వశక్తి అంతా రామనామంలో ఇమిడి ఉంది

1 min read

శ్రీశ్రీశ్రీ రామ్మోహన్ స్వామి

ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  విశ్వశక్తి అంతా రామనామంలో ఇమిడి ఉందని, అటువంటి రామనామంతో సమస్త జీవులు తరిస్తాయని విష్ణుకంటి క్షేత్రం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ రామ్మోహన్ స్వామి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. మూడు రోజుల పాటు కె.సిద్దారెడ్డి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి,రాజుకులాయి , రాంప్రసాద్, అర్చకులు ముఖేష్ శాస్త్రి, మనోజ్ కుమార్, కృష్ణ బాబు, రాముడు, నాగేంద్ర, పుల్లప్ప, వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author