సుప్రీంలో ఆర్ఆర్ఆర్ కు ఎదురుదెబ్బ
1 min readపల్లెవెలుగువెబ్ : సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజుకు మరోసారి చుక్కెదురైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి కేసు కొట్టివేయాలంటూ.. రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను మరోసారి డిస్మిస్ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. కాగా, రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారన్న విషయంలో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.