PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన యువనేత

1 min read

తెలుగుగంగ ప్రాజెక్టును సందర్శించిన లోకేష్

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నయ్ ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన తెలుగు గంగ ప్రాజెక్టును యువనేత నారా లోకేష్ సందర్శించారు.పాదయాత్రలో భాగంగా వెలుగోడు చేరుకున్న లోకేష్… ఆసియాలో అతిపెద్దదైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (తెలుగుగంగ)ను సందర్శించారు.16.4 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ ద్వారా రాయలసీమలోని 1.75లక్షల ఎకరాలకు సాగునీరు, చెన్నయ్ కి తాగునీరు అందుతోంది.1996 సెప్టెంబర్ 23న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి తొలిసారిగా చెన్నయ్ కి నీళ్లు వెళ్లాయి.దివంగ ఎన్టీఆర్, చంద్రబాబునాయుడుల ముందుచూపు, వారికి కరువుసీమపై వారికున్న ప్రేమకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని యువనేత లోకేష్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా వెలుగోడు రిజర్వాయర్ దిగువన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మాది సాయగుణం… మీది దోపిడీ సిద్ధాంతం!

పాదయాత్ర దారిలో తెలుగుగంగ కాల్వవద్ద సెల్ఫీ దిగిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో ఉన్నవాడు శత్రువైనా ఆపన్నహస్తం అందించాలన్న సాయగుణం తెలుగుదేశం పార్టీ బ్లడ్ లోనే ఉంది. వెలుగోడు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ నుంచి చెన్నయ్ వరకు వెళ్లే తెలుగుగంగ ప్రధాన కాల్వ ఇది. రాష్ట్రంలో ఎడారి ప్రాంతాన్ని తలపించే రాయలసీమకు సాగునీటితోపాటు పొరుగుఉన్న తమిళసోదరులకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో అన్న ఎన్టీఆర్ 1983లో తెలుగుగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే… చంద్రబాబు గారు సిఎంగా ఉన్న సమయంలో 1996 సెప్టెంబర్ 23న ఇక్కడ నుంచి తొలిసారిగా నీళ్లు తమిళనాడులోకి ప్రవేశించాయి. దీనిద్వారా రాయలసీమలోని 1.75లక్షల ఎకరాలకు సాగునీరు, చెన్నయ్ ప్రజలకు తాగునీరు అందుతోంది. సొంతలాభం కొంతమానుకు… పొరుగువారికి తోడుపడవోయ్ అన్న సిద్ధాంతం మాదైతే… ఆస్తుల కోసం సొంత తల్లి, చెల్లిని పొరుగు రాష్ట్రానికి తరిమేసి, గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే సిద్ధాంతం జగన్ రెడ్డిదని లోకేష్ పేర్కొన్నారు.

నువ్వు పిల్లకాల్వ అయినా తవ్వావా జగన్?!

తెలుగుగంగ ప్రాజెక్టును సందర్శించిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నయ్ వాసుకు తాగునీరు అందించాలన్న విశాల దృక్పథంతో మా తాత ఎన్టీఆర్ కట్టిన తెలుగుగంగ ప్రాజెక్టు (వెలుగోడు బ్యాలన్సింగ్ రిజర్వాయర్) ఇది. దీనిద్వారా రాయలసీమలోని 1.75లక్షల ఎకరాలకు సాగునీరు అందడమేగాక చెన్నయ్ వాసుల దాహార్తి తీరుతోంది. అధికారంలోకి వచ్చినప్పటినుంచి దోచుకోవడం, దాచుకోవడమే తప్ప రాయలసీమ ప్రజలకోసం ఒక్క పిల్లకాల్వ అయినా నిర్మించావా జగన్మోహన్ రెడ్డీఅంటూ చురకలు వేశారు.

About Author