NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వృద్దాశ్రమానికి నిత్యవసర వస్తువులు అందించిన  డా. శంకర్ శర్మ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు సమీపంలోని జీ. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల  వద్దనున్న టీజీవీ నగర్ లో ఉన్న కృపా వృద్దాశ్రమానికి డాక్టర్ శంకర్ శర్మ నిత్యవసర సరుకులు అందజేశారు. మతిస్థిమితం లోని దాదాపు 30 మంది వృద్దులకు కృపా వృద్దాశ్రమంలో నిర్వహకులు అబ్రహం ఆశ్రమం కల్పించి వారిని పోషిస్తున్నారు. విషయం తెలుసుకున్న డాక్టర్. శంకర్ శర్మ ఆదివారం ఆశ్రమానికి వెళ్లి మానసిక వికలాంగులకు నిత్యవసర వస్తువులు అందించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మానసికంగా సరిగా లేని వారికి ఆశ్రమం కల్పించి వారికి సేవలు చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఇలాంటి ఆశ్రమాలను నిర్వహించే వారికి సహయం చేయవలసిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నిస్వార్థంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న అబ్రహం కుటుంబ సభ్యులను డాక్టర్. శంకర్ శర్మ అభినందించారు.  భవిష్యత్తులో ఆశ్రమానికి తనవంతు సహయసహకారాలు అందిస్తానని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. ఈకార్యక్రమంలో కృపా వృద్దాశ్రమం నిర్వహాకులు  అబ్రహం పాల్గొన్నారు.

About Author