ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : బోగస్ ఓటర్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిపాదించిన ఓటర్ కార్డు-ఆధార్ అనుసంధానం ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు వెల్లడించారు. ఆ ప్రతిపాదనలపై ఇప్పటికే భారత లా కమిషన్ పరిశీలన పూర్తయిందని వివరించారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని బుధవారం లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాజ్దా అహ్మద్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఒకే వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోకుండా ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఈసీ ప్రతిపాదించిందని తెలిపారు.