అబ్దుల్ కలాం జీవితం అందరికి ఆదర్శం
1 min readపల్లెవెలుగు , వెబ్ బనగానపల్లె : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్రం మరియు జాతీయ సేవా పథకం( ఎన్ ఎస్ ఎస్ ) ఆధ్వర్యములో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జయంతిని ప్రపంచ విద్యార్థి దినోత్సవమును నిర్వహించడమైనది కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ స్వర్ణలతా దేవి ఆధ్వర్యంలో అధ్యాపక మరియు విద్యార్థులు అబ్దుల్ కలాం సేవలను కొనియాడారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అబ్దుల్కలాం జీవితం విద్యార్థులకు ఆదర్శప్రాయమని, ఆయన బాట లోనే నడవాలని సూచించారు. అలాగే కళాశాల అధ్యాపకులు ఉమామహేశ్వర రెడ్డి మరియు ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ ఏ.కౌసల్య దేవి మాట్లాడుతూ అబ్దుల్ కలాం రాష్ట్రపతి గా దేశ ప్రజలకు గొప్ప సేవ చేసారని, యువకులకు ఎలా జీవించాలి, దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయాలను బోధించి మేల్కొల్పినారని తెలిపారు. కార్యక్రమము లో కళాశాల ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ కే. బడే సాహెబ్ మాట్లాడుతూ అబ్దులకాలం దేశములో మిస్సైల్ మాన్ గా శాస్త్రవేత్తల చేత గుర్తించబడ్డారని, భారత దేశాన్ని వైజ్ఞానిక రంగములో ముందంజ వేయకనికి కృషి చేసారని కీర్తించారు. ఈ కార్యక్రమములో అధ్యాపకులు డాక్టర్ టి సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ జే. సుధాకర్ రెడ్డి, పి.డి విజయకుమారి, డాక్టర్ కే వి కోటేశ్వరరావు రావు, శ్రీ జి వి నారాయణ, రవి కుమార్, డాక్టర్ కే. రామకృష్ణ, నాగ తిమ్మయ్య, ఆర్. వహీదా మరియు విద్యార్టీని, విద్యార్థులు పాల్గున్నారు.