PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి

1 min read

– మండల బిజెపి నాయకులు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఎండనక ,వాననక, ప్రకృతి వైపరీత్యాలతో, చీడ,పీడలతో పంటలు చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షాల తో, సక్రమంగా దిగు బడి రాక పోయిన, అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న, ఎండనక, వాననక తాను నష్టపోయిన దేశానికి పట్టెడన్నం పెట్టే రైతులను బాధ పెట్టడం మంచిది కాదని మండల బిజెపి నాయకులు, తాసిల్దార్ కార్యాలయంలో కొంతమంది రెవిన్యూ అధికారులపై తాసిల్దార్ పఠాన్ అలీ ఖాన్ కు వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ, స్వార్థం ఎరుగని రైతులు ఎంత కష్టించి తాము పండించిన పంటల ద్వారా నలుగురికి పట్టడన్నం పెట్టడం తెలుసు గాని, ఎవరిని బాధించడం చేతగాని ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అది రైతులు మాత్రమేనని బిజెపి నాయకులు అన్నారు, రైతులు తాసిల్దార్ కార్యాలయానికి రావాలంటేనే ఒకింత అసహనానికి గురవుతున్నారని వారు తెలియజేశారు, ఎందుకంటే వారు చేసే పనులు రైతులను బాధపెట్టే విధంగా ఉన్నాయని వారు తెలిపారు, వీరమ్మ అనే మహిళా రైతు తమ భూమికి సంబంధించి ఆన్లైన్ చేయాలని రెవిన్యూ అధికారులను కోరగా, ఆమె పేరును వీరమ్మ కాకుండా వీరయ్య అని ఆన్లైన్ లో నమోదు చేయడం జరిగిందన్నారు, దానిని సరి చేసేందుకు నెలల తరబడి తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పుకోవడమే కాకుండా, ఆమెకు కుంటి సాకులు చెబుతూ ఆమెనే తప్పు పట్టడం ఎంతవరకు సబవని వారు ప్రశ్నించారు, ఒక రైతు తన పొలానికి మండల సర్వేయర్ చేత భూమి సర్వే చేయించుకుని తన అవసరం నిమిత్తం ఆ భూమిని వేరే వారికి అమ్ముకునే సమయంలో మళ్లీ సర్వే చేయించడం జరిగిందన్నారు, ముందు కలిసిన కొలతలకు, మళ్లీ కులసిన కొలతలకు తేడా రావడంతో ఆ రైతు 5 లక్షల నుండి, 6 లక్షల వరకు నష్టపోవడం జరిగిందన్నారు, ఈ విషయమై ఆ సర్వే యర్ పై స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు, అంతేకాదు, డెత్ సర్టిఫికెట్ కు, బర్త్ సర్టిఫికెట్ కు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కు, ప్రతి సర్టిఫికెట్ కు నిర్దేశించినటువంటి డబ్బును ఇవ్వకపోతే సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి తాసిల్దార్ కార్యాలయంలో మచ్చుకైనా కనపడలేదని వారు రెవిన్యూ అధికారులపై మండిపడ్డారు, ఇంత జరుగుతున్నప్పటికీ ఈ సమస్యలన్నిటిపైన తాసిల్దార్ కు వివరిస్తే ఆయన రైతులను వ్యంగ్యంగా మాట్లాడడం హాస్యాస్పదంగా చూడడం తో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదనపడడం జరుగుతున్నదని వారు తమ బాధను వ్యక్తం చేశారు, మరి కొంతమంది రైతులు పట్టాదారు పాసుబుక్కులు కు దరఖాస్తు చేసుకున్న సంవత్సరం అవుతున్న పాసుబుక్కులు రావడంలేదని, రెవిన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న స్పందన కరువు అయిందని వారు వాపోయారు, అంతేకాకుండా బియ్యం, చక్కెర, కందిపప్పు, రేషన్ కార్డులకు సక్రమంగా ఇవ్వలేదని ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాథుడే లేడని వారు తెలియజేశారు, ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు, ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు మాదినేని రామసుబ్బయ్య, బిజెపి మండల అధ్యక్షులు అధికారి రవి కుమార్, ఎల్ శివారెడ్డి, చిన్నపరెడ్డి, ఆర్ ప్రసాద్, సుబ్బారెడ్డి, టి ఏ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author