లైసెన్స్ లేకుండా, అక్రమంగా బాణా సంచా విక్రయిస్తే చర్యలు తప్పవు
1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : లైసెన్స్ లేకుండా, అక్రమంగా బాణా సంచా విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి హెచ్చరించారు.శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్ లతో బాణా సంచా విక్రయంపై కలెక్టర్ పలు సూచనలు చేశారు.కేటాయించిన ప్రదేశాలలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని టపాకాయలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.దీపావళి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని, అలాగే బాణా సంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

