PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలులో వ‌స్త్రమ‌హ‌ల్‌ను ప్రారంభించ‌నున్న న‌టి రెజీనా

1 min read

* సెప్టెంబ‌ర్ 2న ఘ‌నంగా ప్రారంభోత్స‌వం

* హాజ‌ర‌వుతున్న ప్ర‌ముఖుల్లో సాహితీ శేఖ‌ర్, ఎమ్మెల్యేలు హ‌ఫీజ్ ఖాన్‌, రాంభూపాల్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూలు జిల్లా, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లోని వ‌స్త్రాభిమానుల‌కు శుభ‌వార్త‌. మూడు అంత‌స్థుల‌లో, 8వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో, అన్ని వ‌య‌సుల వారికి, అన్ని వ‌ర్గాల వారికి వారి వారి అభిరుచుల‌కు స‌రిపోయేలా ఒక ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన వ‌స్త్రప్ర‌పంచం మీకు స్వాగ‌తం ప‌లుకుతోంది. క‌ర్నూలులోని అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లో సెప్టెంబ‌రు 2న ‘వ‌స్త్రమ‌హ‌ల్‌’ వ‌స్త్రదుకాణాన్ని ప్రారంభిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టి రెజీనా కెసాండ్రా స్వ‌యంగా హాజ‌రై ఈ వ‌స్త్రమ‌హ‌ల్‌ను ప్రారంభించ‌నున్నారు. ప్ర‌ఖ్యాత కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ కుమార్తె, ప్ర‌ముఖ డాన్స‌ర్ సాహితీ శేఖ‌ర్, గౌర‌వ క‌ర్నూలు ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్, గౌర‌వ పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి కూడా ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు. వ‌స్త్రాభిమానులు అంద‌రూ స‌కుటుంబంగా విచ్చేసి వ‌స్త్రమ‌హ‌ల్‌లోని సంప్ర‌దాయ‌, పాశ్చాత్య దుస్తుల‌ను చూసి ఆనందించాల‌ని రెజీనా, సాహితీ శేఖ‌ర్‌ వ్య‌క్తిగ‌తంగా ఆహ్వానం ప‌లికారు. ఇక్క‌డి క‌లెక్ష‌న్ భార‌త‌దేశ సంస్కృతిని ప్ర‌తిబింబిస్తుంద‌ని చెప్పారు. పురుషులు, మ‌హిళ‌లు, పిల్ల‌లు.. ఇలా స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా విచ్చేసి, అంద‌రికీ కావ‌ల్సిన అన్ని ర‌కాల వ‌స్త్రాల‌ను ఇక్క‌డ కొనుక్కునే అవ‌కాశం ఉంటుంది. ఇక్క‌డ అత్యంత నాణ్య‌మైన‌, మ‌న్నికైన‌, అంద‌మైన దుస్తులు అన్ని వ‌ర్గాల వారికీ అందుబాటు ధ‌ర‌ల్లో ఉంటాయి. ఆత్మ‌విశ్వాసం, మంచి స్టైల్ క‌ల‌గ‌లిసిన దుస్తుల‌ను ఇక్క‌డ ఎంపిక చేసుకుని మ‌రీ తీసుకోవ‌చ్చు. అందుబాటులోనే ల‌గ్జ‌రీ వ‌స్త్రాలు పొంద‌గ‌ల‌గ‌డం వ‌స్త్రమ‌హ‌ల్ ప్ర‌త్యేక‌త అని నిర్వాహ‌కులు చెబుతున్నారు.

ఎన్నెన్నో దుస్తులు..

మ‌హిళ‌ల‌కు చీర‌లు, లెహంగాలు, వెస్ట్ర‌న్ వేర్, పెళ్లిళ్ల‌ ప్ర‌త్యేక దుస్తులు, ఇండో వెస్ట్ర‌న్, డ్ర‌స్ మెటీరియ‌ల్స్, ఫ్యాన్సీ చీర‌లు, డిజైన‌ర్ వేర్, కేట‌లాగ్ చీర‌లు, ప‌ట్టుచీర‌లు, పెళ్లి ప‌ట్టుచీర‌లు, స‌ల్వార్‌లు, కుర్తా పైజ‌మాలు.. ఇలా వారికి కావ‌ల్సిన‌వ‌న్నీ ఉంటాయి. ఇక పిల్ల‌ల‌కు పార్టీ దుస్తులు, ఫెస్టివ‌ల్ వేర్, డైలీ వేర్.. ఇలాంటివ‌న్నీ ఉంటాయి. ఇక పురుషుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండుకు స‌రిపోయేలా ధోతీలు, కుర్తాలు, ష‌ర్టులు, టీష‌ర్టులు, ప్యాంట్లు, జీన్స్, పెళ్లి దుస్తులు, పండుగ ప్ర‌త్యేక దుస్తులు.. ఇలా ఎన్నో ఉంటాయి.

About Author