భారతీయ తత్త్వ చింతనపై చెరగని ముద్ర వేసిన ఆదిశంకరాచార్యులు
1 min read
ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు
కర్నూలు, న్యూస్ నేడు: అద్వైత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యులు దైవాంశ సంభూతుడని, అతి పిన్న వయసులోనే అపారమైన ప్రజ్ఞ, శాస్త్ర పాండిత్యాని కలిగిన ధీశాలి అని ప్రముఖ సంస్కృత పండితులు, వ్యాఖ్యాత డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు అన్నారు. ఆళ్ళగడ్డ పట్టణం మల్లిఖార్జున శాస్త్రి వీధిలోని శ్రీ ఆదిశంకరాచార్య మందిరం నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా వారు శంకరవైభవంపై ప్రవచించారు. ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే దేశం నలుచెరగులా పీఠాలను ఏర్పాటు చేసి, ఈ దేశ, సంస్కృతులను కాపాడుటకు కృషి చేసిన కారణ జన్ముడని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు, అలంకరణ, గోమాతకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శంకరాచార్య ఆలయ ధర్మకర్త విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కాశీభట్ల శివప్రసాద్, బెంగుళూరు ఇన్కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ శేష శైలేంద్ర ఐ.ఆర్.ఎస్. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు టి.వి.వీరాంజనేయరావు, జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా సమన్వయకర్త సి.రామకృష్ణ, శ్రీ ఆదిశంకరాచార్య మందిర నిర్వాహకులు కాశీభట్ల వెంకట విజయలక్ష్మి, అడ్వకేట్ సాయి స్వరూప్, సత్య ప్రసాదు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీ ఆదిశంకర సేవా సత్సంగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.