ఆలపాటి రామచంద్రరావు శత జయంతి మహోత్సవాలు
1 min read
నాలుగు రోజులపాటు జరుగుతున్న జాతీయ నాటక పోటీలు
ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్,ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం (వై.ఏం.హెచ్. ఏ) మరియు హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో మే 17,18,19,20 తేదీలలో నాలుగు రోజుల పాటు జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలు రెండవ రోజు ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ అంబికా రామచంద్రరావు వారి కుటుంబ సభ్యుల సేవలు,కృషి అభినందనీయమని,ఏలూరుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం అందరికీ గర్వకారణం అన్నారు. అతిధులుగా ఆర్.టి.సి. విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ మంత్రి మరడాని రంగారావు, ప్రముఖ సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు యర్రా సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కళారత్న కె.వి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు ఇరదల ముద్దుకృష్ణ, సెక్రటరీ మజ్జి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.రెండవ రోజు మొదటి ప్రదర్శనగా గోవాడ క్రియేషన్, హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ”,రెండవ ప్రదర్శనగా కృష్ణా ఆర్ట్స్ & కల్చరల్ అసోసియేషన్,గుడివాడ వారి ద్వారాబంధాల చంద్రయ్యనాయుడు నాటికలు అలరించాయి.ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త,భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెల్లో ప్రొఫెసర్ డాక్టర్ వెల్చేరు నారాయణరావు గారికి 11వ తానా-గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారాన్ని తానా నాయకులు గొర్రిపాటి చందు, వి.ఎల్.ఎం.ఆర్.వెంకటరావు లు అందించారు.ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన నాయకులు నారా శేషు, అంబికా ప్రసాద్,వేణు గోపాల్ లునాని, మోతే శ్రీనివాస నారాయణరావు, ఆర్.ఎన్.ఆర్. నాగేశ్వరరావు, ఎల్.వెంకటేశ్వరరావు, కె.బి.రావు, ఎస్.సురేష్, డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ యాదవ్,మారం హనుమంతరావు, కానాల మురళీకృష్ణ,అంబికా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. మహమ్మద్ కాజావలి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.