ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి
1 min read– రాజకీయ పార్టీ ఏజెంట్లకు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి
జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: జిల్లాలో ఈ నెల 13 న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, రాజకీయ పార్టీ ఏజెంట్లకు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ గిరీష పి ఎస్ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నేతలతో అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఈరోజు కలెక్టర్ గిరీషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలోకి అనుమతించేందుకు పోలింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సూచించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ మరియు వీడియోగ్రఫీ నిర్వహిస్తారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీలు సంయమనం పాటించాలని, ఎన్నికల సంఘం సూచనలను పాటించాలని ఆయన కోరారు. పోలింగ్ ప్రక్రియలో ఏవైనా సమస్యలుంటే స్థానిక తహశీల్దార్‌కు తెలియజేయాలని ఆయన కోరారు. ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం పంపిన జంబో బ్యాలెట్ బాక్సుల గురించి పార్టీలకు ఆయన అవగాహన కల్పించారు.ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.