PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలి

1 min read

– ప్లానింగ్ కోఆర్డినేటర్ మనోహర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలో డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలని గురువారం నాడు మండల కేంద్రంలో పర్యటించిన.సమగ్ర శిక్ష, ప్లానింగ్ కోఆర్డినేటర్ మనోహర్ రెడ్డి ఆదేశించారు  మండలంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలించారు, అందులో భాగంగా జి.ఈ.ఆర్. హౌస్ హోల్డ్ సర్వే ను పరిశీలించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలని, ఏ ఒక్క పిల్లవాడు కూడా డ్రాప్ అవుట్ ఉండరాదని, వెల్ఫేర్ అసిస్టెంట్ అరుణను, వాలంటీర్ జ్యోతి మరియు సిఆర్పి లకు సూచించారు. అలాగే జగనన్న విద్యా కానుక స్టాక్ పాయింట్ ను పరిశీలించారు, పాఠశాలలు తెరిచే నాటికి జగనన్న విద్యాకానుకను విద్యార్థులకు అందించాలని సూచించారు. తరువాత గడివేముల స్పెషల్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు నేడుపనులను పరిశీలించారు. కేజీబీవీ పాఠశాలలో రెమెడియల్ క్లాసులను పరిశీలించారు, ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, మీరు ఉపాధ్యాయుల సూచనలు తూచా తప్పకుండా పాటిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారని, అదేవిధంగా విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉంటారని, కాబట్టి కష్టపడి చదివి ఉత్తీర్ణులు అవ్వాలని తెలిపారు. ఇదే పాఠశాలలో ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు ఏ.ఎస్.ఓ దస్తగిరి రెడ్డి గారు ఈజీ మెథడ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టిప్స్ ను వివరించారు, చిన్నచిన్న టిప్స్ తో లెక్కల పరీక్షను సులభంగా పాసవచ్చని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఏ.పీ.ఎం ఎం.హెచ్.ఓ.హజరత్ ఎం.ఐ.ఎస్. కోఆర్డినేటర్ హిదాయతుల్లా, డి.టి.పి విజయ్ కుమార్, సి.ఆర్.పి లు పాల్గొన్నారు.

About Author