PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీలు అన్నింటిని చూపించాలి

1 min read

– బి. మాధవస్వామి జిల్లా అధ్యక్షులు ఎపిటిఎఫ్ 

పల్లెవెలుగు వెబ్​ బనగానపల్లె : పట్టణంలో విద్యాశాఖ మంత్రి గారితో ఉపాధ్యాయ సంఘాలు జరిపిన చర్చల్లో ఉపాధ్యాయ బదిలీలలో ఖాళీలు అన్నిటిని చూపిస్తామని తెలియజేయడం జరిగింది. అంతేగాక ప్రమోషన్లు రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. అయితే విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఎవరైతే బదిలీలకు దరఖాస్తు చేసుకుంటారు ఏవైతే లాంగ్ స్టాండ్ ఉంటాయో వాటిని మాత్రమే చూపిస్తాము  అనడం సమంజసం కాదని ఖాళీలన్నిటిని కచ్చితంగా చూపించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి. మాధవ స్వామి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఇచ్చే ప్రమోషన్ అన్నిటిని మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. అలాగే ప్రమోషన్ల కొరకు విల్లింగ్ లేదా నాట్ విల్లింగ్ అడగడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రమోషన్ ఇచ్చే సమయంలోనే విల్లింగ్ లేదా నాట్ విల్లింగ్ తీసుకోవాలని కోరారు. విద్యాశాఖ అసంబద్ధమైన నిర్ణయాలతో ఉపాధ్యాయుల లోకాన్ని గందరగోళం సృష్టిస్తుందని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు ఉత్తిత్తి ప్రమోషన్లు కాకుండా పర్మినెంట్ ప్రమోషన్ ఇవ్వాలని ,ఉత్తుత్తి ప్రమోషన్లతో ఉపాధ్యాయులు నమ్మకం కోల్పోయారని , ఇక వెట్టి చాకిరి ప్రమోషన్లకు స్వస్తివలికి నిజమైన ప్రమోషన్లు ఇవ్వాలని తెలిపారు.బనగానపల్లె ఏ పి టి ఎఫ్ కార్యాలయంలో సమావేశం మండల అధ్యక్షులు జె. వెంకట కృష్ణుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహా అధ్యక్షులు ఎం.మధుసూదన్ రావు, జిల్లా ఉపధ్యక్షుడు జి. లింగమయ్య, రాష్ట్ర కౌన్సిలర్ వి. సుబ్బరాయుడు, నాయకులు రమేష్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

About Author