NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గౌరీపట్నం ప్రేమసేవా చారిటబుల్ ట్రస్ట్ పై ఆరోపణ తగవు

1 min read

బిషప్ జయరావు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తాం

అసత్యపు ఆరోపణలు ఖండిస్తున్నాం

నేషనల్ దళిత జేఏసీ చైర్మన్

పెరికె.వరప్రసాదరావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గౌరీపట్నం ప్రేమ సేవ ఛారిటబుల్ ట్రస్ట్ పై,బిషప్ జయ రావు పై  అవినీతి ఆరోపణలు తగవు   తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని పలువురి హెచ్చరికలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నంలోని ప్రేమ సేవ ఛారిటబుల్ ట్రస్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని పలువురు క్రైస్తవ సంఘం నాయకులు, దళిత నేతలు  ఖండించారు.నిధులు దుర్వినియోగం కాలేదని, ఏలూరు డయాసిస్ బిషప్ మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయ రావు పై అసత్య ఆరోపణలు ఖండిస్తున్నామని, తప్పుడు కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నామని  నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు హెచ్చరించారు. గుంటూరు జిల్లాకు చెందిన పోర్టు మెరక లక్ష్మీ దుర్గ గౌరీపట్నంలోని ప్రేమ సేవా చారిటబుల్ ట్రస్ట్ కు కేవలం 10వేల రూపాయలు విరాళమిచ్చి  బిషప్ తండ్రి  మీద కేసులు పెట్టడం, మా గురువర్యులు,ఫాదర్ లు రాజు,మోజెస్,ధారా రవి, ఫాదర్ జాన్ పీటర్, నాగేశ్వరరావు పై అక్రమ కేసులను పెట్టిన రవి జేసురాజు  ఫోట మెరక లక్ష్మీ దుర్గ వారిపై పరునష్ట దావా వేస్తామని హెచ్చరించారు.బిషప్ తండ్రి  జయ రావుపై, ఫాదర్లపై కేసులు పెట్టడం హేయమైన చర్యగా భావించారు. కొంత మంది  తన సొంత లాభాపేక్ష కోసమే, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు కోసమే బిషప్  పై, ఆర్సీఎం డయాసిస్ పై దుష్ప్రచారం  చేస్తున్నారని పలు ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఫాదర్ జాన్ పీటర్  గౌరీపట్నంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరీపట్నం మేరీమాత ఉత్సవాలు జరుపుతారని, దానికి వచ్చిన కానుకలు సేవా కార్యక్రమాలకు, సంస్థలకు ఖర్చు పెడతారని,ఆ విధంగా ఖర్చు పెట్టడం కూడా అక్రమంగా ఖర్చు పెడుతున్నారని అనటంలో అర్థం ఏమిటని? వారు ప్రశ్నించారు.క్రిస్టియన్ మైనార్టీ సంస్థలపై, ఆస్తులపై అసత్య ఆరోపణలు మానుకోవాలని ఏలూరులోని ప్రజా సంఘ నాయకులు  దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టారు. విలేకరుల సమావేశంలో పెరికె వరప్రసాదరావుతో పాటు  వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి జుంజు మోజెస్, తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు పొలిమేర హరికృష్ణ, నేషనల్ సీనియర్ దళిత నాయకులు నారపాము కిషోర్, కొమ్ముకూరి జయప్రకాష్, విద్యార్థి నాయకుడు చింతాటి  వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

About Author