NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాయిధ‌ర‌మ్ తేజ్ కి అల్లు అర్జున్ ప‌రామ‌ర్శ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇటీవ‌ల బైక్ యాక్సిడెంట్ లో గాయ‌ప‌డ్డ ప్రముఖ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప‌రామ‌ర్శించారు. హైద‌రాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యాన్ని స‌మాచారాన్ని వైద్యుల‌న‌డిగి అల్లు అర్జున్ తెలుసుకున్నారు. డా. అలోక్ రంజ‌న్ నేతృత్వంలోని వైద్య బృందం నిరంత‌రం సాయితేజ్ ఆరోగ్యాన్ని ప‌ర్యేవేక్షిస్తోంది. పుష్ప షూటింగ్ నిమిత్తం కాకినాడ వెళ్లిన అల్లు అర్జున్.. షూటింగ్ ముగిశాక స‌రాస‌రి ఆస్పత్రికి చేరుకుని సాయితేజ్ ని ప‌రామ‌ర్శించారు. ప్రస్తుతం సాయితేజ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, కోలుకుంటున్నార‌ని వైద్యులు చెబుతున్నారు.

About Author