ఆర్ఆర్ఆర్ కు అమెజాన్ భారీ ఆఫర్ !
1 min readపల్లెవెలుగువెబ్ : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్
. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులు. జనవరి 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోన కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు అమెజాన్ సంస్థ భారీగా ఆఫర్ చేసిందని సమాచారం. అమెజాన్ తరచుగా రూ. 30 కోట్లకుపైగా పెట్టుబడితో బిగ్-టికెట్ ఎంటర్‌టైనర్‌లను కొనుగోలు చేస్తుంది. అంటే పలు పెద్ద చిత్రాలను కొనుక్కొని పే-పర్ వాచ్ రూపంలో ఓటీటీలో విడుదల చేస్తుంది. ఇలా యూఎస్‌ఏ సర్క్యూట్‌లో తరచుగా కొంటూ రిలీజ్ చేస్తుంది. కానీ భారతీయ మార్కెట్‌లో ఇలాంటి ప్రయోగం మాత్రం ఇప్పటివరకూ చేయలేదు అమెజాన్. అలాగే యూట్యూబ్‌లో కూడా కొన్ని సినిమాలను అద్దెకు చూడవలసి ఉంటుంది. అలాంటి సినిమాలను నిర్ణీత ధరతో ఒక రోజు కోసం అద్దెకు తీసుకుంటుంది. ఇలాంటి ఆఫర్‌ను ఆర్ఆర్‌ఆర్ చిత్ర యూనిట్‌కు అమెజాన్ ఇచ్చింది. దీని ద్వారా సులభంగా రూ. 200 కోట్ల ఆదాయాన్ని పొందవచ్చని తెలిపిందట. అయితే, ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ ఆఫర్ ను తిరస్కరించిందని సమాచారం. థియేటర్లలో విడుదల చేస్తేనే అధిక ఆదాయం పొందవచ్చని చిత్రయూనిట్ భావిస్తోందట.