స్టార్ బక్స్ సీఈవోగా భారతీయుడు !
1 min read

పల్లెవెలుగువెబ్ : అమెరికా కేంద్రంగా పనిచేసే బహుళ జాతి (ఎంఎన్సీ) కాఫీ చెయిన్ స్టార్బక్స్ సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ (55) నియమితులయ్యారు. నరసింహన్ ఇప్పటి వరకు బ్రిటన్ కు చెందిన రెకిట్ బెనికిసర్ అనే అంతర్జాతీయ సంస్థకు సీఈఓగా పని చేశారు. డ్యూరెక్స్ కండోమ్స్, ముసినెక్స్ కోల్డ్ సిరప్ వంటి అనేక ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేసి మార్కెట్ చేస్తోంది. రెకిట్ సంస్థ సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు నరసింహన్ ప్రకటించిన మరుసటి రోజే, ఆయన్ని తమ సంస్థ సీఈఓగా నియమిస్తున్నట్టు స్టార్బక్స్ ప్రకటించడం విశేషం.

