NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవంగా ముగిసిన అనసూయమ్మ మెమోరియల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్

1 min read

క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలి

టిడిపి యువనాయకులు రాజేంద్ర గౌడ్,భువనేశ్వర్ గౌడ్,లక్ష్మీనారాయణ గౌడ్

హోళగుందన్యూస్ నేడు: హోళగుందమండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో వేసవి సెలవుల సందర్భంగా టిడిపి మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అనసూయమ్మ మెమోరియల్ రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం వైభవంగా ముగిసింది.ఆదివారం ఎపిడిఎస్ హోళగుంద X హులేబీడు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది.ముందుగా టిడిపి యువనాయకులు రాజేంద్ర గౌడ్,భువనేశ్వర్ గౌడ్,లక్ష్మీనారాయణ గౌడ్ టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.మొదట బ్యాటింగ్ చేసిన హులేబీడు టీమ్ 10 ఓవర్లలో 128 పరుగులు చేసింది.తర్వాత బ్యాటింగ్ చేసిన ఎపిడిఎస్ హోళగుంద టీమ్ 10 ఓవర్లలో 97 పరుగులు చేసింది.దీంతో హులేబీడు టీమ్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. విజేతగా  నిలిచిన హులేబీడు టీంకు మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ గౌడ్,యువ నాయకులు రాజేంద్ర గౌడ్, భువనేష్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు రూ.50000 నగదు బహుమతితో పాటు కప్ ను అందించారు.రన్నర్ గా నిలిచిన ఎపిడిఎస్ హోళగుంద  టీమ్ కు రూ.30000 నగదు బహుమతితోపాటు కప్పును అందించారు.ఈ సందర్భంగా యువ నాయకుడు రాజేంద్ర గౌడ్, నాయకులు మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని అన్నారు.క్రీడలు శారీరక,మానసిక ఆరోగ్యాలను పెంపొందించడంతోపాటు, నైతిక సామాజిక వికాసాలను పెంపొందిస్తాయన్నారు.యువత క్రీడలలో చురుకుగా పాల్గొని ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.యువత చెడు వ్యసనాలకు పోకుండా ఉన్నతమైన లక్ష్యాలతో తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు.యువతను ఇదే విధంగా ఎల్లప్పుడూ తమ ప్రోత్సాహం ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బాగోడి రాము,మాజీ మండల కన్వీనర్ వీరన్న గౌడ్, తెలుగు యువత అధ్యక్షుడు బకాడి వీరేష్,మైనారిటీ అధ్యక్షుడు మోయిన్,బుడగ జంగాల రామంజీని,మైనారిటీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహ్మాన్, వీరేష్, తిమ్మా రెడ్డి,హుసేన్ పీరా,కన్నయ్య,గిరి,పవన్,బిజెపి నాయకులు ప్రసాద్, జాంటి వీరేష్, ఆర్గనైజర్లు శాలి.అమాన్, మల్లయ్య, సిద్ధార్థ, మల్లి, బాగోడి శీను, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *