PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంధ్రప్రజల ఆపద్బాంధవుడు…చంద్రబాబు:సాయినాథ్​ శర్మ

1 min read

పల్లెవెలుగువెబ్​, కమలాపురం: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలపై జానపద కళా బృందాల ద్వారా ప్రజల ను చైతన్య పరచి ముఖ్యమంత్రి పీఠం పై చంద్రబాబు నాయుడును కూర్చో పెట్టడమే  తమ ధ్యేయమని ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఆయనకు ఇచ్చే పుట్టిన రోజు కానుక ఆని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయి నాథ శర్మ అన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ముందస్తు వేడుకలు మంగళవారం నాడు నియోజకవర్గ కేంద్రమైన కమలాపురం పట్టణంలోని కడప తాడిపత్రి ప్రధాన రహదారిలో మూడు రోడ్ల కూడలి వద్ద టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్య సాయి నాథ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. జానపద కళాకారుల పాటలతో నృత్యాలతో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయులు ఆద్వర్యంలో  వేడుకలు నిర్వహించారు. పుట్టిన రోజు పురస్కరించుకుని  చంద్రబాబు నాయుడు 12 అడుగుల కటౌట్ కు పూలమాల వేసి కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాయినాథ్ శర్మ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లేలా అహర్నిశలు తెలుగు ప్రజల పరువు ప్రతిష్టల కోసమై పాటుపడిన ఆదర్శనీయుడు నిరు పేద ప్రజల ఆపద్బాంధవుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరలా అగ్రగామిగా నిలపాలంటే అది ఒక చంద్రబాబునాయుడుకే  సాధ్యమ న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో తల్లడిల్లి పోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి గడపగడపకు వెళ్లి వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి ప్రజా చైతన్యం కలిగించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడమే తమ ముందున్న లక్ష్యంగా ఆయన ఉద్ఘాటించారు ఈ సందర్భంగా చంద్రబాబు చిత్ర పటానికి పాలాభి షేకం చేసి ఊరేగింపు నిర్వచించారు. ఈ కార్యక్రమంలో  టిడిపి నాయకులు రైతు సంఘం నాయకుడు కల్లూరు జనార్ధన రెడ్డి,  ఎం పి టి సి నాగరాజ ఆచారి, మాజీ సర్పంచ్ హరిత సుధాకర్, మైనార్టీ నాయకులు హనీఫ్, హైదర్ షుఖూర్,  కమలాపురం నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

About Author