PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అంగన్​వాడీలు’.. భవిష్యత్​ పోరాటాలకు సిద్ధం కండి : ఏఐటీయూసీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆస్పరి: అంగన్​వాడీ కేంద్రాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కారం కోసం అంగన్​వాడీ వర్కర్స్​ మరియు హెల్పర్స్​ .. భవిష్యత్​ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఏఐటీయూసీ నాయకులు. శనివారం కర్నూలు జిల్లా ఆస్పరి అంగన్​వాడీ కేంద్రంలో ఏపీ  అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తాలూకా నాయకురాలు విశాలాక్షి  ఛాయాదేవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.  సమావేశానికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జై లలితమ్మ, జిల్లా కార్యదర్శి ఆర్ సుగుణమ్మ, ఏఐటీయూసీ మండల కార్యదర్శి కృష్ణమూర్తి  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేద బడుగు బలహీన వర్గాల తల్లుల పిల్లల లోప పోషణ ను అరికట్టడానికి , మాతాశిశు మరణాలను తగ్గించడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 1975 అక్టోబర్ రెండవ తేదీ నాడు దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించి నేటికి 47 సంవత్సరాలు అవుతుందన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాఖ నిర్వహణకు సంబంధించి సరైన వసతి సామాగ్రి , మెనూ కు సంబంధించిన నాణ్యమైన సరుకులు సకాలంలో సప్లై చేయకుండా సంవత్సరాల తరబడి బకాయి బిల్లుతో సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   వర్కర్స్ కి 11,500 రూ హెల్పర్స్ కి 7000 మినీ టీచర్స్ కి 7000 రూపాయలు ఇస్తూ ఎలాంటి ఉద్యోగ భద్రత  ఈఎస్ఐ పిఎఫ్ పెన్షన్ ఇన్సూరెన్స్ గ్రావిటీ హెల్త్ కార్డు లేకుండా వెట్టిచాకిరికి గురిచేస్తున్నారని, ప్రమోషన్స్ విషయం ఎన్నిసార్లు ప్రస్తావించిన  వాయిదా వేస్తూ నే ఉన్నారని ఆరోపించారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీ వర్కర్స్ కి అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 19, 20 తేదీల్లో నిర్వహించే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర 7వ మహాసభలు కర్నూలులో నిర్వహిస్తున్నారని, సభను జయప్రదం చేయాలని కోరారు.  కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకురాలు  నాగమణి, ఆదిలక్ష్మి,ప్రమీల చిట్టెమ్మ,ఆర్ నాగమణి,గీతావా ని,సరోజ తదితరులు పాల్గొన్నారు.

About Author