కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అంగన్వాడీల సమ్మె సార్వత్రిక సమ్మె
1 min read
చెన్నూరు, న్యూస్ నేడు : దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సిపిఎం సిపిఐ పార్టీలు భారత్ బంద్ పిలుపునివ్వడంతో బుధవారం చెన్నూరు మండల వ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు బందుకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మండల కేంద్రమైన చెన్నూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఉదయం ధర్నా చేపట్టారు. అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్తలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 26 వేల కనీస వేతనం కేటాయించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాల్లో అన్ని మ్యాపులను రద్దు చేయాలని అలాగే పేస్ మ్యాప్ కూడా రద్దు చేయాలని కోరారు. 5సంవత్సరాల పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లోని ఉండే విధంగా జీవో తీసుకురావాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అంగన్వాడీ కార్యకర్తలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం మండల తాసిల్దార్ సరస్వతి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తులసమ్మ .పద్మ .రాధా . గుర్రమ్మ. లక్ష్మీదేవి అనేకమంది అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.
