లేబర్ కోడ్లు ను రద్దు చేసేంతవరకు పోరాటం ఆగదు…
1 min read

పత్తికొండ , న్యూస్ నేడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్లు ను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య అన్నారు. బుధవారం దేశవ్యాప్తంగా 22వ సార్వత్రిక సమ్మె భాగంగా పత్తికొండ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి సిఐటియు, ఏఐటియుసి, ట్రేడ్ యూనియన్, ప్రజాసంఘాలు నాయకులు, కార్యకర్తలు లేబర్ కోడ్లు రద్దు చేయాలి అంటూ నినాదంతో నాలుగు స్తంభాల మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు మండల కార్యదర్శి గోపాల్ ,ఎఐటియుసి రంగన్న అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామచంద్రయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్మికులను, ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తే సహించేది లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం తీసుకొచ్చిన నూతన 4 లేబర్ కోడ్లు ను రద్దుచేసి పోరాడి సాధించుకున్న 44 లేబర్ కోడ్లు ను కొనసాగించేంతవరకు పోరాటం చేస్తామని ఆర్ హెచ్చరించారు. రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే స్వామినాథ మిషన్ సిఫారసు ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మిక హక్కులను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో కార్మికులు, కర్షకులు, రైతులు, ప్రజా సంఘాలు ,ట్రేడ్ యూనియన్లు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి రాజా తదితరులు పాల్గొన్నారు.


