PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

200 మందికి ఉచితంగా సున్తీ లు నిర్వహించిన అంజుమన్ సంస్థ..

1 min read

– సంస్థ సేవలు అభినందనీయం..

– అభినందించిన కో- ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు:  స్థానిక అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉచితంగా నిర్వహించే సున్తీల కార్యక్రమం ఆదివారం అంజుమన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారుగా 3 లక్షల రూపాయల ఖర్చుతో జిల్లా నలుమూలలు నుండి వచ్చిన 2 వందల మంది పేద ముస్లింలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారన్నారు. క్యాంపుకు వచ్చిన వారికి భోజనం, పాలు, వసతితో పాటు గాయం మానేవరకు ఉచితంగా మందులు ఇస్తున్న మన్నారు. అంజుమన్ సంస్థ చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఇది ఒకటి అన్నారు. అంజుమన్ సంస్థకు ఉన్న ఆస్తులలో శిధిల అవస్థలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ను కోటి 50 లక్షల రూపాయల వ్యయంతో 26 షాపులు నూతనంగా నిర్మించారన్నారు. ఈ విధంగా వస్తున్న ఆదాయంతో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పేదలకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నమన్నరు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు, పేద ముస్లింల వివాహాలకు ధన సహాయం అందిస్తున్నామని సంతోషంగా తెలిపారు, చనిపోయిన వారి మట్టి ఖర్చులకు2,000 సహాయం అందిస్తున్నమన్నరు. మసీదులో ప్రార్థనలు చేసే పెద్దలకు గౌరవ వేతనంగా కొంత సొమ్మును అందిస్తున్నామని తెలిపారు, రంజాన్ పండుగ దినాలలో ఉపవాసాలు ఉండే వారికి చివరి పది రోజులు భోజన సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు, ఇంకా ఇటువంటి ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు అంజుమన్ సంస్థ ద్వారా నిర్వహించాలని ఎస్ ఎం ఆర్ పెదబాబు కోరారు. అంజుమన్ సంస్థ అధ్యక్షులు సులేమాన్ మాట్లాడుతూ ఉన్న ఆస్తులను కాపాడుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఎస్ఎం ఆర్ పెదబాబు సహకారం ఎల్లప్పుడూ ఈ విధంగానే ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ సెక్రెటరీ, 46వ డివిజన్ కార్పొరేటర్ ఇలియాస్ పాషా, అంజుమాన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author