దేవీ నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ ,ఏలూరు : శ్రీ శ్రీ దేవి నవరాత్రుల మహోత్సవాలు 32 వ డివిజన్ అమీనా పేట రామాలయం వద్ద ఏటిగట్టు నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, అమ్మవారి విగ్రహం ఇచ్చిన దాత సుందర నీడి గంగాధ రావు దంపతులు ఏర్పాటు చేశారు. గత ఐదు 12 సంవత్సరాల నుండి దసరా ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు, దాతల సహకారంతో సుమారు 3000 మంది భక్తులు అన్న దాన ప్రసాదo స్వీకరించారు,కమిటీ సభ్యులు అధ్యక్షులు అదపాక పార్థసారథి, ఉపాధ్యక్షులు సుందర నీడి గంగాధర్ రావు,గౌరవ అధ్యక్షులు ఎలమంచిలి శేషు, కమిటీ సభ్యులు మరియు యూత్ సభ్యులు తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు, అనంతరం విగ్రహ దాతల దంపతులకు,నవరాత్రి 9 రోజులు ప్రసాదం దాతల దంపతులకు,తొమ్మిది రోజుల అమ్మవారికి లంకరణ చేసిన దంపతులకు,ఆల్ రౌండర్ పాపారావుకి కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 31 32 డివిజన్ల కార్పొరేటర్లు బండారు కిరణ్ కుమార్, పొతర్లంక లక్ష్మణరావు,విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.