NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ కాశిరెడ్డి నాయన దేవస్థానంలో అన్నదానం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణ శివార్లలోని వైభవ డాబా దగ్గరలోని శ్రీ కాశిరెడ్డి నాయన దేవస్థానం లో శనివారం పగడాల వెంకట రమణయ్య సతీమణి మాధవి దంపతులు , వారి కుటుంబ సభ్యులు ఈ శ్రీకాశిరెడ్డి నాయనా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అన్నదాన కార్యక్రమానికి హాజరైన భక్తులు శ్రీ కాశిరెడ్డి నాయన స్వామి వారిని దర్శించుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు. అటువైపు వెళుతున్న బాటసారులు, ప్రయాణికులు, భక్తులు సుమారు 200 మంది వచ్చి అన్నదానాన్ని స్వీకరించారు.

About Author