ఉద్యోగ, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చెయ్యాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశ వ్యాప్త సమ్మె లో భాగంగ ఈ రోజు జరిగిన సమ్మెలో బ్యాంకు ఉద్యోగ సంఘాలు AIBEA, AIBOA, BEFI పాల్గొన్నవి అందులో భాగంగా కర్నూలు లో జిల్లా పరిషద్ నుండి కలెక్టరేట్ వరకు అన్నీ కార్మిక సంఘాల తో కలసి నినాదాలు ఇచుకుంటూ ర్యాలీ గా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వివిధ సంఘాలు తమ తమ డిమాండ్ల ను వివరించి సభ ముగించారు.
డిమాండ్స్:
1. ప్రభుత్వరంగ బ్యాంకులను, ఇన్స్యూరెన్స్ కంపెనీలను బలోపేతం చెయ్యాలి.2. బ్యాంక్, గ్రామీణ బ్యాంక్, ఇన్స్యూరెన్స్ రంగ ప్రైవేటీకరణను ఆపాలి.3. ఇన్స్యూరెన్స్ వ్యాపారం లో 100 శాతం విదేశీ పెట్టుబడులను నిరోధించాలి.4. ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలను విలీనం చెయ్యాలి.5. తగినంత పర్మినెంట్ ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.6. టెంపరరీ, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ విధానాన్ని రద్దు చెయ్యాలి,7. నేషనల్ పెన్షన్ పథకాన్ని రద్దుచేసి అందరికీ నిర్దిష్ట పెన్షన్ (ఓపిఎస్) పథకాన్ని వర్తింపజేయాలి.8. కార్పొరేట్ మొండి బాకీలను కఠిన చర్యల ద్వారా వసూలు చెయ్యాలి.9. ఖాతాదారుల సేవల మీద చార్జీలు తగ్గించాలి,10. ఇన్స్యూరెన్స్ పాలసీల మీద జిఎస్టీ రద్దు చెయ్యాలి11. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ అను రద్దు చెయ్యాలి.12. ట్రేడ్ యూనియన్ హక్కులను కాపాడాలిసమ్మె లో ఏఐటీఈఏ నాయకులు ఇ నాగరాజు, శివ కృష్ణ, అనిల్ రెడ్డి, ఎల్లయ్య, వాసుదేవ రెడ్డి, పద్మావతి గ్రామీణ బ్యాంకు యూనియన్ నాయకులు హనుమంత రెడ్డి, నాగరాజు, రియాజుద్దీన్,సురేష్ పాల్గొన్నారు.