ఏపీ.. ఈనెల ఉచిత బియ్యం లేవు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఇస్తోన్న ఉచిత బియ్యం పంపిణీని ఈనెల రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెలలో ఇవ్వాల్సిన దానితో కలిపి వచ్చే నెలలో రెండు నెలలకు కలిపి ఒకేసారి ఒక్కో వ్యక్తికి పది కిలోలు చొప్పున ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ భావిస్తోంది. పౌరసరఫరాల శాఖ వద్ద నాన్ సార్టెక్స్ బియ్యం నిల్వలు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. రెగ్యులర్ కోటాలో సార్టెక్స్ చేసిన బియ్యం ఇస్తోన్న ప్రభుత్వం, ఉచిత కోటాలో మాత్రం నాన్ సార్టెక్స్ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. నాన్ సార్టెక్స్ బియ్యం నిల్వలను మార్చి నెల వరకూ ఇవ్వగా ఈ నెలలో కొరత ఏర్పడింది.